News December 3, 2024

ఆస్తులను లాగేసుకోవడం కొత్త ట్రెండ్: CBN

image

AP: ఆస్తులు లాగేసుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్‌గా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా చూడలేదని క్యాబినెట్ సమావేశంలో చెప్పారు. కాకినాడ పోర్టును కేవీ రావుకు 41శాతం ఇచ్చి, అరబిందో 59శాతం లాక్కుందని అన్నారు. వైసీపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. పథకాలపై అభిప్రాయాల సేకరణ చేయిస్తున్నట్లు తెలిపారు. బియ్యం, భూ దురాక్రమణ మాఫియాలను అరికడతామని చెప్పారు.

Similar News

News December 1, 2025

ఎలక్షన్ ఫీవర్.. మెదక్ ఎస్పీ హెచ్చరిక

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలంటే ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. గొడవలు, ప్రేరేపించే వ్యాఖ్యలు, ఓటర్లపై ఒత్తిడి, డబ్బు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలకు ఆయుధాలు, మొబైల్‌లు నిషేధం. పుకార్లు పుట్టిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అనుమానాస్పద ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

News December 1, 2025

‘హిల్ట్’పై గవర్నర్‌కు BJP ఫిర్యాదు

image

TG: ‘హిల్ట్’ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని BJP గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. 9,292.53 ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకే అప్పగిస్తోందని, దీనివెనుక ₹5లక్షల CR స్కామ్‌ ఉందని ఆరోపించింది. వెంటనే జోక్యం చేసుకొని భూములను పరిరక్షించాలంది. ‘హిల్ట్’ను రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని పార్టీ చీఫ్ రామచందర్‌రావు, LP నేత మహేశ్వర్ రెడ్డి గవర్నర్‌కు అందించిన వినతిలో కోరారు.

News December 1, 2025

ధాన్యం కొనుగోళ్లు.. రూ.2,300 కోట్లు జమ చేేశాం: నాదెండ్ల

image

AP: రాష్ట్రంలో ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.2,300 కోట్ల నగదును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం నిల్వలకు సంచుల కొరత లేకుండా చూస్తున్నామని, టార్పాలిన్లు ఉచితంగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.