News October 4, 2024

చిన్న ఆలయాలకు సాయం రూ.10వేలకు పెంపు

image

AP: ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.7వేలు అర్చకుడి భృతిగా, రూ.3వేలు పూజలకు వినియోగించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని అర్చకుడి ఖాతాలోనే జమ చేస్తామంది. దీనివల్ల రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.32.40 కోట్ల భారం పడనుంది.

Similar News

News October 4, 2024

గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ALERT

image

AP: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు, టీచర్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరారు. <>www.ceoandhra.nic.in<<>> ద్వారా ఫామ్-18, 19 సమర్పించాలని సూచించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్లు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల టీచర్ల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామన్నారు.

News October 4, 2024

1,497 ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

image

SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. పలు విభాగాల్లో 1,497 డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్, BE, ఎంటెక్, Mscతో పాటు పని అనుభవం కలిగిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750(SC, ST, దివ్యాంగులకు మినహాయింపు). ఇతర వివరాలు, అప్లై చేసుకోవడానికి <>https://sbi.co.in<<>> వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News October 4, 2024

ఇరాన్ పోర్టులో భారత WAR SHIPS.. ఆగిన ప్రతీకార దాడి!

image

ఇరాన్ మిసైళ్ల దాడికి ఇజ్రాయెల్ ఎందుకు ప్రతీకారదాడి చేయలేదు? అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. యుద్ధ నిపుణులు భారత్‌నూ ఓ కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం INS శార్దూల్, INS టిర్, ICGS వీరా గల్ఫ్ తీరంలో ఇరాన్‌తో కలిసి ఓ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పుడు ఎయిర్‌స్ట్రైక్స్ జరిగితే కలిగే నష్టం అపారం. అందుకే ఇజ్రాయెల్‌తో భారత్ ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. నౌకలు తిరిగొచ్చాక ఏమవుతుందో చూడాలి.