News September 2, 2024

భూమిని సమీపిస్తున్న గ్రహశకలం.. ప్రమాదమా?

image

భారీ గ్రహశకలం ఒకటి భూమికి అత్యంత సమీపంగా వస్తోందని సమాచారం. దీని పరిమాణం 720 అడుగులు. అంటే 2 ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. పేరు 2024 ON. సెప్టెంబర్ 15న భూమికి 6,20,000 మైళ్ల సమీపం నుంచి వెళ్లనుంది. అంత దూరమైతే దగ్గర అంటారేంటి అనేగా మీ డౌట్. అంతరిక్ష శాస్త్రం కొలతలను బట్టి ఇది దగ్గరే. చంద్రుడి కన్నా భూమికి 2.6 రెట్లు ఎక్కువ దూరంగా వెళ్తుంది కాబట్టి మనకేమీ ప్రమాదం లేనట్టే.

Similar News

News October 17, 2025

బంగారం, వెండి కొంటున్నారా?

image

ధన త్రయోదశి సందర్భంగా రేపు బంగారం, వెండి కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. అష్టైశ్వర్యాల అధినాయకురాలైన ధనలక్ష్మి కటాక్షం కోసం.. లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొని, పూజించాలని సూచిస్తున్నారు. ఈరోజున కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే రాబోయే ఏడాదంతా ఆర్థిక ఇబ్బందులు కలగవని, సంపదకు లోటుండదని అంటున్నారు. ధనలక్ష్మి అనుగ్రహంతో కృపాకటాక్షాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

News October 17, 2025

రేపటి బంద్‌లో అందరూ పాల్గొనాలి: భట్టి

image

TG: BCలకు రిజర్వేషన్లపై నిర్వహించే బంద్‌లో అందరూ పాల్గొనాలని Dy.CM భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ‘BRS రిజర్వేషన్లను 50%కి పరిమితం చేసి BC కోటాను తగ్గించింది. మేం సైంటిఫిక్ సర్వే లెక్కల ప్రకారం 42% కల్పించాం. బిల్లును ఆమోదించి పంపినా కేంద్రం ఆమోదించడం లేదు. అందుకే రిజర్వేషన్ల పెంపు కోర్టుల్లో నిలిచిపోతోంది. BJP నైజం బయటపడింది. వారిప్పుడు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మరు’ అని భట్టి అన్నారు.

News October 17, 2025

​స్కాలర్​షిప్.. రేపే లాస్ట్ డేట్

image

​నేషనల్​ మీన్స్​ కమ్​ మెరిట్​ స్కాలర్​షిప్​ స్కీమ్(NMMSS-2026)కు దరఖాస్తు చేసేందుకు రేపే చివరి తేది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు రేపటి లోగా ఆన్​లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాలి. OCT​ 22లోగా ఆన్​లైన్​‌లో అప్లై చేసిన ఫామ్‌ను సంబంధిత పాఠశాల HMలు DEOలకు పంపించాల్సి ఉంటుంది. ఈ స్కీం ద్వారా ఆర్థికంగా వెనకబడిన మెరిట్ స్టూడెంట్స్​కు 9వ తరగతి నుంచి ఇంటర్​ వరకు ఏటా రూ.12వేల స్కాలర్​షిప్​ అందజేస్తారు.