News April 12, 2024
2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములు: ఇస్రో ఛైర్మన్

జాబిల్లి రహస్యాలను తెలుసుకునేందుకు 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీనికోసం శ్రీహరికోటలోని షార్‌లో మూడో ప్రయోగ వేదిక నిర్మిస్తామన్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2028లో చంద్రయాన్-4ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. భవిష్యత్తు ప్రయోగాల కోసం టెక్నాలజీని మెరుగుపరుచుకుంటున్నామని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
‘రైతన్న.. మీకోసం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే ‘రైతన్న.. మీకోసం’ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.


