News January 26, 2025
రాజ్ భవన్లో ‘ఎట్ హోం’.. సీఎం, మంత్రులు హాజరు

TG: రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఇతర నేతలు, అధికారులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్ గ్రహీత డా.నాగేశ్వర్ రెడ్డి రాగా సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు.
Similar News
News November 18, 2025
హిడ్మాకు బహుభాషల్లో పట్టు

మడావి హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్త. తెలంగాణ కమిటీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(PLGA)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. మురియా తెగకు చెందిన ఆయనకు హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. కొద్దిరోజులుగా అతడు లొంగిపోతాడనే ప్రచారం జరిగినా ఈ ఉదయం అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో హతమయ్యాడు.

YCP అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి అరెస్టు

AP: YCP అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డిని HYDలోని తన ఇంట్లో ఈ ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. కాగా పరకామణి కేసులో కీలకంగా ఉన్న సతీశ్ మృతిపై వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని అనంతపురం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.