News April 11, 2024

ఓ దశలో కెనడా వెళ్లిపోదాం అనుకున్నా: బుమ్రా

image

ప్రస్తుతం టీమ్‌ఇండియాకు కీలక బౌలర్‌గా ఉన్న బుమ్రా ఓ దశలో కెనడాలో స్థిరపడాలని అనుకున్నారట. ఆయన భార్య సంజనా గణేశన్‌తో కలిసి చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నా కెరీర్ తొలినాళ్లలో క్రికెట్ కలిసి రాకుంటే ఫ్యామిలీతో సహా కెనడా వెళ్లిపోయి అక్కడ బంధువుల వద్ద ఉండి చదువుకుందామని అనుకున్నా. కానీ అమ్మ దేశాన్ని విడిచిపెట్టేందుకు ఇష్టపడలేదు. అదృష్టవశాత్తు నాకు అవకాశాలు వచ్చాయి’ అని తెలిపారు.

Similar News

News November 16, 2024

కులగణన సకాలంలో పూర్తి చేయండి: రేవంత్

image

TG: కులగణనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ‘44.1శాతం సర్వే పూర్తైంది. 5.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తైంది. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని సీఎం సూచించారు.

News November 15, 2024

ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జిగా రవిబాబు

image

AP: ఒంగోలు నియోజకవర్గ YCP ఇన్‌ఛార్జిగా చుండూరి రవిబాబును ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం), బొడ్డేడ ప్రసాద్ (అనకాపల్లి)లను నియమించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించింది. ఆముదాలవలస YCP సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.

News November 15, 2024

శాంసన్, తిలక్ ఊచకోత.. భారత్ భారీ స్కోర్

image

చివరి టీ20లో సౌతాఫ్రికా బౌలర్లను భారత బ్యాటర్లు ఊచకోత కోశారు. శాంసన్(109*), తిలక్ వర్మ(120*) సెంచరీల మోత మోగించారు. జోహెన్నెస్‌‌బర్గ్‌లో బౌండరీల వర్షం కురిపించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 283/1 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ, తిలక్ విధ్వంసానికి సఫారీ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మ్యాచ్‌లో మొత్తం 23 సిక్సర్లు బాదడం విశేషం. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 36 రన్స్‌తో రాణించారు.