News April 29, 2024

78 ఏళ్ల వయసులో.. ‘ఇంటర్‌’ పరీక్షలు

image

చదువుకు వయసుతో పనిలేదని నిరూపిస్తున్నారు ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసున్నా ఆయన ఇప్పటికీ విద్యార్థియే. ఈ వయసులో ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కాగా నిజామాబాద్‌లో పరీక్షలు రాస్తున్నారు. తన తండ్రి రోజూ సుమారు 4 గంటల పాటు చదువుతున్నారని ఆయన కుమారుడు పరశురాం తెలిపారు. ఎల్లాగౌడ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి 2007లో రిటైర్‌ అయ్యారు.

Similar News

News November 21, 2025

వరంగల్‌: రేపు జాబ్ మేళా

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి బి. సాత్విక కోరారు. ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ మేళాకు అర్హులన్నారు.

News November 21, 2025

వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

image

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News November 21, 2025

పరమ పావన మాసం ‘మార్గశిరం’

image

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.