News July 9, 2024
అటల్ పెన్షన్ ₹10వేలకు పెంపు?

అటల్ పెన్షన్ స్కీమ్ లబ్ధిదారులకు మినిమమ్ గ్యారంటీడ్ అమౌంట్‌ను డబుల్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొదుపు చేసే మొత్తం ఆధారంగా ప్రస్తుతం కేంద్రం ₹1000-₹5వేల వరకు పెన్షన్ ఇస్తోంది. కొత్త ప్రతిపాదన ఓకే అయితే ఇది డబుల్ కానుంది. పేద, దిగువ మధ్య తరగతి వారి కోసం కేంద్రం 2015లో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. 60ఏళ్లు దాటిన వారికి ఈ పెన్షన్ వస్తుంది. కాగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఇందుకు అనర్హులు.
Similar News
News February 7, 2026
ఉన్న వాటినే కాపాడుకోలేరు.. పాక్‌పై J&K సీఎం సెటైర్లు

కశ్మీర్ తమ దేశంలో <<19062687>>అంతర్భాగమవుతుందని<<>> పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నించగా జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘మేం వారిలో భాగమవుతామా? వాళ్ల దగ్గర ఉన్న వాటినే సరిగ్గా చూసుకోలేరు. ఇక మాతో ఏం చేస్తారు?’ అంటూ సెటైర్లు వేశారు.
News February 7, 2026
ఈ చిచ్చరపిడుగును WC జట్టులోకి తీసుకోవాల్సిందేనా?

వైభవ్ సూర్యవంశీ. వయసు 14 ఏళ్లు. ఆడుతోంది వరల్డ్ కప్ ఫైనల్. అయితే ఏంటి? 15 సిక్సర్లు, 15 ఫోర్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 80 బంతుల్లోనే 175 రన్స్ చేశారు. వైభవ్ ఇంకొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే భారత్ స్కోర్ ఈజీగా 500 దాటేది. దీంతో ఈ పిల్లాడిని త్వరగా టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. వీలైతే T20 WC జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. COMMENT?
News February 7, 2026
చక్కటి నిద్ర కోసం సింపుల్ టిప్స్

*ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి.
*గదిలో చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. ఐ మాస్క్ ధరించాలి.
*రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయకూడదు.
*పడుకోవడానికి 3-4 గంటల ముందు మద్యం సేవించవద్దు.
*రోజూ ఉదయం వ్యాయామం చేయడంతో పాటు ఉదయాన్నే కనీసం 30 నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.


