News November 22, 2024
కేజ్రీవాల్ కంటే ఆతిశీ వెయ్యి రెట్లు నయం: LG

ఆప్ ప్రభుత్వంతో నిత్యం తగువుకు దిగే LG సక్సేనా మొదటి సారి CM ఆతిశీని ప్రశంసించారు. IGDT మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘లింగ భేదాన్ని నిలువరించి ఇతరులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో నిరూపించుకోవాలి. ఈ రోజు ఢిల్లీ సీఎం మహిళ అయినందుకు సంతోషిస్తున్నా. గత పాలకుడి(కేజ్రీవాల్) కంటే ఆమె వెయ్యి రెట్లు నయం’ అన్నారు. LG వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Similar News
News January 23, 2026
అమెజాన్లో 16 వేల ఉద్యోగాల కోత!

అమెజాన్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 16 వేల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెజాన్ 30 వేల మందిని తొలగించనుందని గతేడాది అక్టోబర్లో రాయిటర్స్ తెలిపింది. ఈ క్రమంలో తొలి విడతలో 14 వేల మందిని ఆ కంపెనీ ఇంటికి పంపింది. రెండో విడతలో భాగంగా ఈనెల 27 నుంచి లేఆఫ్స్ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే తమకు మేనేజర్లు హింట్ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు. 2023లోనూ 27 వేల మందిని అమెజాన్ తీసేసింది.
News January 23, 2026
మామిడిలో ఇనుపధాతు లోప లక్షణాలు – నివారణ

మామిడి చెట్లలో ఇనుపధాతు లోపం వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోయి ఆకుల సైజు తగ్గిపోతాయి. ఈ తీవ్రత ఎక్కువగా ఉండే మొక్కల ఆకులు పైనుంచి కింద వరకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం నివారణకు 2.5 గ్రాముల అన్నభేది+1 గ్రాము నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
News January 23, 2026
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.


