News October 6, 2024

ఐదో రోజు అట్ల బతుకమ్మ

image

TG: బతుకమ్మ పండగ నిర్వహించే తొమ్మిది రోజుల్లో రోజుకో విశిష్ఠత ఉంది. ఇవాళ ఐదో రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యాన్ని మర పట్టించి ఆ పిండితో అట్లు పోసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. ఆడవాళ్లు వీటిని ఒకరికొకరు వాయినంగా ఇచ్చుకుంటారు. ఇవాళ బతుకమ్మను ఐదు వరుసల్లో వివిధ పూలతో చేస్తారు.

Similar News

News October 6, 2024

45 ఏళ్లలో 102TMCలు.. ‘శ్రీశైలం’లో తగ్గిన కెపాసిటీ

image

AP: శ్రీశైలం ప్రాజెక్టులో 1976లో 308.06TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. ప్రాజెక్టులో పూడిక పెరిగిపోవడంతో 2021 నాటికి కెపాసిటీ 205.95TMCలకు పడిపోయింది. 45 ఏళ్లలో 102TMCల సామర్థ్యం తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలసంఘం కలిసి రిమోట్ సెన్సింగ్, హైడ్రో గ్రాఫిక్ సర్వేల ద్వారా ఈ అధ్యయనం చేశాయి. ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకోవాలని సాగునీటి నిపుణులు కోరుతున్నారు.

News October 6, 2024

విజయం ట్రంప్‌దే.. ‘Polymarket’ అంచనా

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్వల్ప తేడాతో విజయం సాధించే అవకాశం ఉందని ‘Polymarket’ అంచనా వేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ట్రంప్‌కు 50.1%, కమలా హారిస్‌కు 48.9% ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెడిక్షన్ మార్కెట్ గా ‘Polymarket’ కంపెనీ గుర్తింపు పొందింది. కాగా, అమెరికా ఎన్నికలకు ఇంకా 31 రోజులు మిగిలి ఉన్నాయి.

News October 6, 2024

ఇవాళ, రేపు వర్షాలు

image

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వికారాబాద్, మల్కాజిగిరి, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.