News July 26, 2024
ATMలలో జమ చేయాల్సిన డబ్బుతో ఉద్యోగి పరారీ

ATMలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బుతో ఉద్యోగి పరారైన ఘటన రాజమండ్రిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఉద్యోగి అశోక్ కుమార్ ATMలలో నగదు డిపాజిట్ కోసం వెళ్లాడు. అయితే.. వాటిని డిపాజిట్ చేయకుండా ఉడాయించడంతో పోలీసులకు సమాచారం వచ్చింది. అశోక్ దాదాపు రూ.2.40 కోట్లతో పరారైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అలర్ట్ చేసి అతడి కోసం గాలిస్తున్నారు.
Similar News
News November 12, 2025
విద్యార్థిని అభినందించిన మంత్రి దుర్గేష్

నిడదవోలుకు చెందిన విద్యార్థిని కుంచాల కైవల్యా రెడ్డి నాసా ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం(ఐఏఎస్పీ)కి ఇటీవల ఎంపికైంది. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ..కుంచాల కైవల్య రెడ్డిని అభినందించారు. విద్యార్థిని తల్లిదండ్రులను నిడదవోలు టౌన్ రోటరీ ఆడిటోరియంలో బుధవారం కలిశారు.
News November 12, 2025
తూ.గో: ఎక్కడ ఎన్ని ఇళ్లంటే..!

తూ.గో జిల్లాలో 8,773 ఇళ్లలో గృహప్రవేశాలు బుధవారం జరగనున్నాయి. పీఎంఏవై బీఎల్సీ పథకం కింద 7,200, పీఎంఏవై గ్రామీణ పథకం కింద 1,573 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని హౌసింగ్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాతి బుజ్జి తెలిపారు. రాజమండ్రిలో 375 ఇళ్లు, రాజానగరంలో 631, గోపాలపురంలో 1,760 ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు.