News August 26, 2024
ATMలో చోరీకి యత్నం.. అన్నదమ్ముల అరెస్ట్

ఏలూరు జిల్లా ముదినేపల్లి వైజంక్షన్లో ఉన్న యాక్సిక్ బ్యాంక్ ఏటీఎంలో చోరి జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు. కైకలూరు స్టేషన్లో ఈ కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. బెండి రామకృష్ణ, బెండి లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అన్నదమ్ములైన రామకృష్ణ, లక్ష్మీనారాయణ ఈనెల 14న ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతనానికి యత్నించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నేడు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వాటి ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి Meekosam. ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చాన్నారు.

News November 16, 2025
ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.