News January 28, 2025

ATM కార్డుతో పరార్.. పల్నాడు SPకి ఫిర్యాదు

image

ATMలో డబ్బులు తీయడం రాని ఓ వ్యక్తి మోసపోయాడు. బొల్లాపల్లి మండలం మేళ్లవాగుకు చెందిన వెంకటేశ్వర్లు ATMకి వెళ్లారు. డబ్బులు తీయడం తెలియక ఓ వ్యక్తి సాయం కోరాడు. అతడు రూ.10వేలు తీసి ఇచ్చి ఏటీఎం కార్డుతో పారిపోయాడు. వెంకటేశ్వర్లుకు తెలియకుండా మరోసారి రూ.57వేలు డ్రా చేశాడు. నిందితుడిని గుర్తించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

Similar News

News September 13, 2025

ధవళేశ్వరం విచ్చేసిన సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామానికి ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేశారు. శనివారం గ్రామంలో జరిగిన మెండా సీతారామయ్య పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పున్నమరాజు వీర్రాజు పాల్గొన్నారు.

News September 13, 2025

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం జిల్లాల వారీగా ఎస్పీలను బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కృష్ణారావును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ మీనా సోమవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది.

News September 13, 2025

రాత్రిళ్లు వాస్తు ఎందుకు చూడరంటే..

image

పాతకాలం పండితులు రాత్రి సమయంలో వాస్తు చూడరాదని చెప్పారు. ఎందుకంటే రాత్రి వేళల్లో ఉండే చీకటి వల్ల నిర్మాణంలోని సూక్ష్మమైన లోపాలు కనిపించకపోవచ్చు. కంటితో చూసే అంచనాలు తప్పు కావచ్చు. పరిసరాలలోని శక్తి ప్రవాహాన్ని, దిశలను సరిగ్గా అంచనా వేయడం కష్టం. దీనివల్ల వాస్తు దోషాలు కలిగే అవకాశం ఉంది. అందుకే వాస్తు శాస్త్ర నిపుణులు రాత్రిపూట వాస్తు చూడటాన్ని నిరాకరించారు.