News January 28, 2025

ATM కార్డుతో పరార్.. పల్నాడు SPకి ఫిర్యాదు

image

ATMలో డబ్బులు తీయడం రాని ఓ వ్యక్తి మోసపోయాడు. బొల్లాపల్లి మండలం మేళ్లవాగుకు చెందిన వెంకటేశ్వర్లు ATMకి వెళ్లారు. డబ్బులు తీయడం తెలియక ఓ వ్యక్తి సాయం కోరాడు. అతడు రూ.10వేలు తీసి ఇచ్చి ఏటీఎం కార్డుతో పారిపోయాడు. వెంకటేశ్వర్లుకు తెలియకుండా మరోసారి రూ.57వేలు డ్రా చేశాడు. నిందితుడిని గుర్తించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

Similar News

News September 13, 2025

15న తిరుపతికి రానున్న మారిషస్ PM

image

మారిషస్ ప్రధానమంత్రి నవీన్‌ రాంగుళం ఈనెల 15న తిరుపతికి రానున్నారు. తిరుపతి సమీపంలోని రామాపురం బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

News September 13, 2025

మేడ్చల్: వామ్మో.. కరెంట్ బిల్లు చూసి షాక్..!

image

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల డివిజన్ సూరారం దొమ్మర పోచంపల్లి పరిధిలో వినియోగదారుడికి రూ.7 వేలకు పైగా కరెంట్ బిల్లు వచ్చి షాక్ అయ్యాడు. అధిక బిల్లు ఎందుకొచ్చిందని అధికారులను ప్రశ్నించాడు. ‘రెండు నెలలుగా అధిక బిల్లులపై కస్టమర్లు అడిగినా EE, మీటర్ రీడింగ్ ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. సెప్టెంబర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని బాధితుడు కోరాడు.

News September 13, 2025

మహబూబాబాద్: ‘అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి’

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. మండలాల తహశీల్దార్లు, స్థానిక పోలీస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, వైద్య శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైన చోట్ల ముందస్తు ప్రణాళికతో ప్రజలకు సహాయక చర్యలు అందించాలని కోరారు.