News August 26, 2024

రెంట్ కట్టలేదని ATMకి తాళం

image

TG: ఇంటి అద్దె చెల్లించలేదనే కారణంతో కరీంనగర్ జిల్లాలోని ఓ ఏటీఎం సెంటర్‌కు తాళం వేశారు. ‘రెంట్ చెల్లించని కారణంగానే మూసివేశాం’ అనే బోర్డు కూడా తగిలించారు. ఒక్క నెల ఈఎంఐ చెల్లించడం కాస్త ఆలస్యమైనా ఫోన్ల మీద ఫోన్లు చేసి, ఛార్జీల మీద ఛార్జీలు వేసే బ్యాంకులకు రెంట్ కట్టేంత డబ్బు లేదా? అని సోషల్ మీడియాలో ఓ యూజర్ ప్రశ్నించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News April 2, 2026

ఈ దేశాల్లో సగం మంది సింగిల్స్!

image

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ‘సోలో లైఫే సో బెటర్’ అనుకునే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. వరల్డ్ స్టాటిస్టిక్స్ డేటా-2024 ప్రకారం స్వీడన్(51%), డెన్మార్క్(50%), ఫిన్లాండ్(49%), జర్మనీ(48%), నార్వే(47%) దేశాల్లో దాదాపు సగం మంది ఒంటరిగానే ఉంటున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, పెళ్లిని అవసరంలా కాకుండా ఆప్షన్‌లా చూడటం వంటివి ఇందుకు ముఖ్య కారణాలు. ఇక ఇండియాలోనూ 25% మంది ఒంటరిగా ఉంటున్నారట. మరి మీరూ సింగిలేనా?

News April 2, 2026

రాష్ట్రానికి YCP పీడ విరగడవ్వాలి: CBN

image

AP: అమరావతిపై YCPకి ఇప్పటికీ జ్ఞానోదయం కలగలేదని CM CBN విమర్శించారు. ‘అసెంబ్లీలో తీర్మానం పెడితే రాలేదు. కనీస జ్ఞానముండే వ్యక్తి అయితే రావాలి. పార్లమెంటులో అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ YCP. ఆ పార్టీ పేరు పలకాలా? ప్రజలంతా ఇక దాన్ని మరిచిపోవాలి. ఈ రాష్ట్రానికి వైసీపీ పీడ విరగడవ్వాలి’ అని అన్నారు. మావిగన్ ఏంటో అర్థం కాలేదని, డిక్షనరీలోనూ లేదని ఎద్దేవా చేశారు.

News April 2, 2026

హార్ముజ్ సంక్షోభంపై కీలక భేటీ.. భారత్ అటెండ్!

image

హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలపై UK ఏర్పాటు చేయనున్న కీలక సమావేశంలో భారత్ పాల్గొంటుందని కేంద్రం తెలిపింది. ఈరోజే జరగనున్న ఈ వర్చువల్ భేటీకి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరవుతారని వెల్లడించింది. గ్యాస్, ఇంధనంతో వస్తున్న భారత నౌకల భద్రత కోసం ఇరాన్ సహా ఇతర దేశాలతో టచ్‌లో ఉన్నామని, ఇప్పటికే 6 నౌకలు సేఫ్‌గా దాటాయని తెలిపింది. హార్ముజ్‌ సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది.