News March 24, 2025
ATP: అధికారులు స్పందించలేదని రైతుల ఆత్మహత్యాయత్నం!

యల్లనూరు మం. నీర్జాంపల్లికి చెందిన లక్ష్మీనారాయణ, చిన్నవేంగప్ప ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. శనివారం రాత్రి గాలివానలకు 20ఎకరాలలో అరటి తోట నేలకొరిగింది. అధికారులకు ఫోన్ చేస్తే ఆదివారం సెలవని, తాము రాలేమని సమాధానం చెప్పడంతో మనస్తాపం చెందిన రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారికి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Similar News
News November 24, 2025
విజేతలుగా కడప జిల్లా టీంలు

పులివెందలలో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్ – 14 బాలుర, బాలికల ఫైనల్స్లో విజేతలుగా కడప జిల్లా జట్లు నిలిచాయి. ఇక రన్నర్గా ఈస్ట్ గోదావరి జట్టు నిలిచింది. 6-4 తేడాతో బాలుర జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలికల జట్టు గోదావరి జట్టుపై 2-1 తేడాతే గెలిచింది. ఇందులో అనూష ఉత్తమ ప్రతిభ కనబరిచింది. వీరికి ఎంఈవో చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.
News November 24, 2025
రియల్ కంపెనీలపై ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్లోని 8 రియల్ ఎస్టేట్ కంపెనీలపై ED దాడులు చేసింది. జయత్రి, జనప్రియ, రాజా డెవలపర్స్, శ్రీ గాయత్రి హోమ్స్, శివసాయి కన్స్టక్షన్స్ తదితర కంపెనీల్లో అగ్రిమెంట్స్, హార్డ్ డ్రైవ్స్ సహా పలు డాక్యుమెంట్స్, డిజిటల్ అసెట్స్ సీజ్ చేశారు. ప్రి లాంఛ్ పేరుతో కస్టమర్స్ నుంచి జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రూ.60 కోట్లు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించిందని వచ్చిన కంప్లైంట్స్పై ఈ రైడ్స్ జరిగాయి.
News November 24, 2025
కొమురం భీమ్కు SP నివాళి

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నితికా పంత్ కెరమెరి (M) జోడేఘాట్లోని ఆదివాసీ నాయకుడు కొమరం భీమ్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎస్పీ, ఏఎస్పీకి ఆదివాసీ పెద్దలు పూల మొక్కలు అందించి, తలపాగా చుట్టి ఘనస్వాగతం పలికారు. గిరిజన ఆచార సంప్రదాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. మారుమూల గిరిజన ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.


