News April 13, 2025

ATP: ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తి కాపాడిన పోలీసులు

image

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని అనంతపురం జిల్లా యాడికి పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. స్థానికుల వివరాల మేరకు.. యాడికికి చెందిన గంజి శేఖర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్య సౌమ్యకు వీడియో పంపాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వీరన్న టెక్నాలజీని ఉపయోగించి ఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్య చేసుకోబోయిన గంజి శేఖర్‌ను కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Similar News

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 11, 2026

అనంత: ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకాడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.

News March 11, 2026

అనంత: ఈ రోజు నుంచి ఉచితం

image

గర్భాశయ కాన్సర్‌ను నిర్మూలించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు DMHO దేవి తెలిపారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలనకు బాలికలకు ముందస్తుగా HPV టీకాలు బుధవారం నుంచి వేస్తామన్నారు. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య బాలికలు 16,449 మంది ఉన్నారన్నారు. వారికి సరిపడా డోసులు ముందస్తుగానే జిల్లాకు చేరాయన్నారు. ఒక్కో డోసు ఖరీదు రూ.3,989 కాగా వాటిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందన్నారు.