News November 13, 2024
ATP: ఇటీవలే పెళ్లి.. గుండెపోటుతో యువకుడి మృతి

విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ (26) అనే యువకుడు గుండెపోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఆటోలో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు బాబా ఫక్రుద్దీన్‌కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News March 14, 2026
పదో తరగతి పరీక్షలకు పటిష్ఠమైన బందోబస్తు: ఎస్పీ

పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద, ప్రశ్నపత్రాలు తీసుకుని వెళ్లే సమయంలో బందోబస్తు, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
News March 14, 2026
మరి కాసేపట్లో గుత్తికొట ఉత్సవాలు ప్రారంభం

గుత్తి ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న గుత్తి కోట ఉత్సవాలు మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు ప్రజలు ఒక్కొక్కరుగా వస్తున్నారు. స్టేజ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోట ఉత్సవాలు 2 రోజుల పాటు జరగనున్నాయి.
News March 13, 2026
SKU నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.


