News January 28, 2025
ATP: ఉద్యోగం రాలేదని యువకుడి బలవన్మరణం

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాప్తాడు మండలంలో జరిగింది. అనంతపురానికి చెందిన జయచంద్ర(25) బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. అయినప్పటికీ ఉద్యోగం రాలేదు. మనస్తాపానికి గురైన అతను ఇవాళ రాప్తాడు మండలం జంగాలపల్లి, ప్రసన్నాయిపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 3, 2025
వార్షిక ఆదాయ లక్ష్యాలను అధిగమించండి: కలెక్టర్

జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్, రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను 100% అధిగమించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదాయం తెచ్చిపెట్టే శాఖల్లో వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News December 3, 2025
GHMCలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం

TG: గ్రేటర్ హైదరాబాద్లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. ఇది నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ORR వరకు, దానికి అవతలి వైపు ఆనుకొని ఉన్న ప్రాంతాలను GHMCలో విలీనం చేయాలని ఇటీవల ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయించింది. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ విలీనం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది.
News December 3, 2025
అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం: సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని సీఎం రేవంత్ రెడ్డి ఏద్దేవా చేశారు. బుధవారం హుస్నాబాద్ ప్రజా పాలన సభలో మాట్లాడుతూ లక్ష కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులతోనే నేటికీ తెలంగాణ ప్రజలకు నీటిని అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ వైఫల్యమైందని విమర్శించారు.


