News November 19, 2024

ATP: ఉద్యోగాల పేరిట మోసం.. ముగ్గురి అరెస్ట్

image

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి రూ.15లక్షలు వసూలు చేసి మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలుకు చెందిన సునీత, అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రసాద్ రెడ్డి, బాబ్జాన్ సాహెబ్‌లు గుత్తికి చెందిన నిఖిల్‌తో పాటు మరి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అరెస్ట్ చేశారు.

Similar News

News March 9, 2026

అనంత: YCP సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్

image

ITDP నాయకురాలు జె.రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన అనంతపురం (D) మద్దెలచెరువుకు చెందిన YCP సోషల్ మీడియా కన్వీనర్ మదిగుబ్బ అశోక్‌ను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. TTD ఛైర్మన్ BR నాయుడు వ్యవహారంలో రేణుక మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన అశోక్‌ను అరెస్ట్ చేసినట్లు CI నాయబ్ రసూల్ తెలిపారు. నిందితుడు సయ్యద్‌ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి విధితమే.

News March 9, 2026

మాజీ ఎంపీ తలారి రంగయ్యకు ప్రాణహాని: నారాయణ

image

కళ్యాణదుర్గం ఈ-స్టాంప్ కుంభకోణంపై హైకోర్టులో పోరాడుతున్న మాజీ ఎంపీ డా. తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని YCP నాయకులు నారాయణ, తిమ్మరాయుడు తెలిపారు. తక్షణమే ఆయనకు 2+2 పోలీసు భద్రత కల్పించాలని సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. స్కామ్ బాధ్యుల నుంచి రంగయ్యకు ముప్పు ఉందని ఆరోపించారు.

News March 9, 2026

అనంతపురం కలెక్టరేట్‌లో ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహణ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. భూ వివాదాలు, సంక్షేమ పథకాలు, ఇతర పరిపాలనా పరమైన సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.