News January 2, 2025
ATP: ఒంటరితనమే ఆత్మహత్యకు కారణమా?
అనంతపురంలోని ఓ కళాశాలలో <<15040374>>ఇంటర్<<>> విద్యార్థిని చిన్నతిప్పమ్మ (17) బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అందిన వివరాల మేరకు.. బాలిక చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆర్డీటీ సహకారంతో చదువుకుంటోంది. తన జూనియర్ ఓ బాలికతో స్నేహం ఉండగా ఇటీవల వారి మధ్య దూరం పెరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒంటరితనంగా ఫీలై ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 8, 2025
అనంతపురం పోలీస్ గ్రౌండ్స్‌లో ‘డాకు’ ప్రీ రిలీజ్ ఈవెంట్
అనంతపురంలో రేపు జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. తొలుత ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ ప్లాన్ చేయగా తాజాగా పోలీస్ గ్రౌండ్స్‌కు మార్చారు. దీంతో నిర్మాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతకు తరలిరానున్నారు. మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు.
News January 8, 2025
అనంతలో విషాదం.. వివాహిత ఆత్మహత్య
అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లో ఉండే పుష్పావతి అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 8, 2025
ఎస్సీ కులగణనపై 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ: కలెక్టర్
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కుల గణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అన్ని తనిఖీలు పూర్తిచేసి ఈనెల 20న వివరాలను విడుదల చేస్తారన్నారు.