News February 20, 2025

ATP: గుండెపోటుతో లారీలోనే డ్రైవర్ మృతి

image

యాడికి మండలం వేములపాడు సమీపంలో లారీలో నిద్రిస్తున్న డ్రైవర్ నరసింహులు నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. యల్లనూరు మండలం గొడ్డుమర్రికి చెందిన నరసింహులు లారీలో గ్రానైట్ తీసుకొని కర్ణాటకకు బయలుదేరాడు. నిద్ర రావడంతో వేములపాడు సమీపంలో లారీ ఆపి క్యాబిన్‌లోనే నిద్రపోయాడు. నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Similar News

News March 24, 2025

అనంత: ఈతకు వెళ్లి 10th విద్యార్థి మృతి.!

image

అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద ఉన్న చెక్‌డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సోమవారం 10వ తరగతి పరీక్ష రాసి స్నేహితులతో కలిసి చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన విశ్వతేజ మృతి చెందాడు. అతడికి ఫీట్స్ రావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతపురం రూరల్ పరిధిలోని మొబ్బు కొట్టాలలో వారి కుటుంబం నివసిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

News March 24, 2025

ఎల్లనూరు మండలంలో 971 ఎకరాలలో పంట నష్టం

image

ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

error: Content is protected !!