News June 24, 2024

ATP: టమాట కిలో రూ.80

image

టమాట ధరలు కొండెక్కాయి. ఎన్నికల సీజన్ ముగిశాక వాటి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. సామాన్యులు టమాటలను కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అనంతపురంలోని పాతూరు మార్కెట్లో కిలో టమాట రూ.80 ధర పలుకుతుంది. రెండు రోజుల కిందట కిలో రూ.60 ఉండగా ఒక్కసారిగా రూ.20 పెరగడంతో ప్రజలు కొనలేని పరిస్థితి. దీంతో పాటు క్యారెట్, బీన్స్ ధరలు కూడా అమాంతం పెరిగాయి. పచ్చిమిర్చి కిలో రూ.120 పలుకుతోంది.

Similar News

News July 11, 2025

కరవు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందాం: కేంద్ర మంత్రి

image

రాయలసీమ జిల్లాల్లో కరవు నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొందామని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో దక్షిణ ఏపీలోని కరవు పీడిత జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News July 10, 2025

‘విద్యార్థులారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’

image

అనంతపురం JNTUలో స్వీడన్ బ్యాచ్ కోర్స్‌ను ప్రారంభించినట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. 4 ఏళ్ల బీటెక్ CSE/ECE కోర్సులో మొదట మూడేళ్లు JNTUలో, 4వ ఏడాది స్వీడన్‌లో చదవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

News July 8, 2025

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలి: కలెక్టర్

image

పాఠశాలలో ఈనెల 10న జరగనున్న మెగా పేరంట్, టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మీటింగ్‌లో తల్లితండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి గురించి వివరించాలన్నారు.