News April 2, 2025

ATP: తాగునీటి సమస్య రాకుండా చూడాలి- కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చేతి పంపులు, పవర్ బోర్లు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా, నియోజకవర్గ స్థాయి అన్ని విభాగాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2025-26 కేటాయించిన లక్ష్యాలను సాధించాలన్నారు.

Similar News

News October 7, 2025

అనంతపురంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుక

image

అనంతపురంలోని పాతూరులో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహర్షి వాల్మీకి చూపిన ధర్మమార్గం, సమానత్వం, న్యాయం పట్ల ఉన్న భావాలను మనమందరం ఆచరణలో పెట్టుకోవాలని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కొఠారి కుష్బూ, తదితరులు పాల్గొన్నారు.

News October 7, 2025

యాడికి: పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్

image

పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ విధించిన ఘటన యాడికిలో చోటు చేసుకుంది. సీఐ వీరన్న వివరాల మేరకు.. మండలానికి చెందిన ఓ బాలికపై బత్తుల కృష్ణారెడ్డి గత శనివారం అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు వేములపాడు సమీపంలో ఉండగా సోమవారం అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.

News October 6, 2025

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 375 అర్జీలను స్వీకరించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చిన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజా క్షేమం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.