News October 14, 2024
ATP: నేడే లాటరీ.. కిక్కు ఎవరికో

మద్యం షాపులను నేడు లాటరీ ద్వారా కేటాయించనున్నారు. అనంతపురం జిల్లాలోని 136 దుకాణాలకు 3,265, శ్రీ సత్యసాయి జిల్లాలోని 87 షాపులకు 1,518 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రతి దుకాణదారుడికి ఒక నంబర్ కేటాయించి, మాన్యువల్‌గా లాటరీ తీస్తారు. నంబర్ వచ్చిన దరఖాస్తుదారుకు లైసెన్సు కేటాయిస్తారు. వారు ఈ నెల 16 నుంచి వైన్ షాపులు ప్రారంభించుకోవచ్చు.
Similar News
News December 17, 2025
ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన తాడిపత్రి మండల వాసి

తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఎస్సై నియామకాల్లో ఎంపికయ్యారు. 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో వద్దనుకొని ఏపీలో విధులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతపురం PTC కళాశాలలో ట్రైనింగ్ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు చేపట్టారు.
News December 17, 2025
బాదనహాల్ రైల్వే స్టేషన్ ప్రారంభం

డి.హిరేహాల్ మండలం బాదనహాల్ రైల్వే స్టేషన్‌ను రైల్వే అధికారులు బుధవారం ప్రారంభించారు. రాయదుర్గం -సోమలాపురం రైల్వే స్టేషన్ల మధ్య ఇటీవల కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు. మంగళవారం ఈ రూటులో పలు రైళ్లు రద్దు చేసి బాదనహాల్ స్టేషన్లో లైన్ మార్పిడి చేశారు. అనంతరం రైలును ఈ ట్రాక్‌పై నడిపి ట్రయల్ రన్ చేశారు. నూతన బిల్డింగ్‌ను ప్రారంభించారు. పలువురు హుబ్లి డివిజన్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.
News December 17, 2025
అనంత: సూరీడు సమయం మారిపోతోంది.!

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.


