News March 23, 2026

ATP: పడిపోయిన గుడ్డు.. కొండెక్కిన నిమ్మ ధరలు

image

జిల్లాలో కోడిగుడ్డు ఎగుమతి లేక చితికి పోగా, నిమ్మపండు వేసవి ఆరంభంలో దిగుబడి తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటాయి. నెల క్రితం డజను గుడ్లు రూ.100 ఉండగా, నేడు రూ.65 కి చేరింది. జనవరిలో 100 నిమ్మపండ్లు రూ.300 ఉండగా, ఫిబ్రవరిలో రూ.600 కగా, మార్చి రూ.1,200 వరకు పెరిగింది. మార్కెట్లో సరఫరా తగ్గడం, వేసవి ప్రభావం కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలుపుతున్నారు. దీంతో సాధారణ ప్రజలు వాటికి దూరమవుతున్నట్లు అయింది.

Similar News

News April 20, 2026

@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

image

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.

News April 20, 2026

NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

image

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.

News April 20, 2026

సేంద్రియ మేళా సూపర్‌ హిట్: కలెక్టర్

image

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.