News November 6, 2024

ATP: పరారైన బాలుడిని తండ్రికి అప్పగించిన పోలీసులు

image

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయి విశాఖ నగరానికి చేరుకున్నాడు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూర్చుని ఉన్న బాలుడిని స్థానికులు గుర్తించి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడి వివరాలు అడిగి తెలుసుకుని పాపా హోంలో ఆశ్రయం కల్పించారు. మంగళవారం ఉదయం నగరానికి చేరుకున్న తండ్రికి బాలుడిని అప్పగించారు.

Similar News

News December 2, 2024

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు: ఎస్పీ జగదీశ్

image

పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. అధికలోడ్‌తో వెళ్లడం సురక్షితం కాదన్నారు. ఈ విషయాన్ని డ్రైవర్లు, ప్రయాణికులు గుర్తించి ఓవర్లోడింగ్‌కు స్వస్తి పలకాలని కోరారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే ఆటోల్లో ప్రయాణించే ముందు, క్షణం ఆలోచించి అందుకు దూరంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

News December 2, 2024

అనంతపురం జిల్లాలో 11,862 మంది HIV రోగులు

image

రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా అనంతపురం జిల్లాలో 11,862, శ్రీ సత్యసాయి జిల్లాలో 11,089 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఏటా రాష్ట్రంలో 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తెలిపింది. 2023లో అనంతపురం జిల్లాలో 235 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 231 మంది HIV బారినపడ్డారు.

News December 2, 2024

సీఎం చంద్రబాబు గొప్ప మనసు.. కళ్యాణదుర్గం చిన్నారికి అండ!

image

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన లిఖిత అనే చిన్నారికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్న విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నేమకల్లు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. బాధితులు సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.