News September 16, 2024
ATP: పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పారని యువకుడి ఆత్మహత్య
ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన విజయ్ కుమార్ మేనమామ కుమార్తెను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి ఇంట్లో సంప్రదించగా కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News October 10, 2024
శ్రీ సత్యసాయి బాబాతో రతన్ టాటాకు అనుబంధం
టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా శ్రీ సత్యసాయిబాబా భక్తుడు. పలుమార్లు ఆయన పుట్టపర్తికి వచ్చారు. 2009 డిసెంబర్ 3న చివరిసారిగా సాయిబాబాను దర్శించుకున్నారు. సత్యసాయిబాబా సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై రతన్ టాటా ఆసక్తి చూపించేవారు. రతన్ టాటాకు ప్రశాంతి నిలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది.
News October 10, 2024
SKU పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
SKU పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత విడుదల చేశారు. మొత్తం 8,551 మంది పరీక్ష రాయగా 3,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో BAలో 461 మందికి గానూ 108 మంది, BBAలో 818 మందికి గానూ 353 మంది, BCAలో 174 మందికి గానూ 62 మంది, BCMలో 4,512 మందికి గానూ 1,635 మంది, BSCలో 2,586 మందికి గానూ 1,234 మంది ఉత్తీర్ణత చెందారు.
News October 10, 2024
ఈ-పంట నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాలోని ఈ-పంట నమోదు ప్రక్రియ సూపర్ చెక్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మతో కలిసి వ్యవసాయ అనుబంధ రంగ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.