News November 30, 2024
ATP: బాలికపై ఆత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. పుట్లూరులో 2020లో 6ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా నిందితుడు అత్యాచారం చేశాడని అమ్మమ్మ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.3 వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు.
Similar News
News December 2, 2024
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు: ఎస్పీ జగదీశ్
పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. అధికలోడ్‌తో వెళ్లడం సురక్షితం కాదన్నారు. ఈ విషయాన్ని డ్రైవర్లు, ప్రయాణికులు గుర్తించి ఓవర్లోడింగ్‌కు స్వస్తి పలకాలని కోరారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే ఆటోల్లో ప్రయాణించే ముందు, క్షణం ఆలోచించి అందుకు దూరంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
News December 2, 2024
అనంతపురం జిల్లాలో 11,862 మంది HIV రోగులు
రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా అనంతపురం జిల్లాలో 11,862, శ్రీ సత్యసాయి జిల్లాలో 11,089 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఏటా రాష్ట్రంలో 3,510 మంది దీని బారిన పడుతున్నట్లు తెలిపింది. 2023లో అనంతపురం జిల్లాలో 235 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 231 మంది HIV బారినపడ్డారు.
News December 2, 2024
సీఎం చంద్రబాబు గొప్ప మనసు.. కళ్యాణదుర్గం చిన్నారికి అండ!
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన లిఖిత అనే చిన్నారికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్న విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నేమకల్లు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. బాధితులు సీఎం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.