News July 9, 2024
ATP: భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకుని

బత్తలపల్లి మండలం తంభాపురంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మన్న (80) భార్య లక్షమ్మ పింఛన్ డబ్బులు ఇవ్వలేదని ఈనెల 6న రోకలి బండతో కొట్టారు. దీంతో ఆమె మృతి చెందింది. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన ఆయన నిందితుడిగా ముద్ర పడిందని మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మండలంలోని చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News December 12, 2025
టీడీపీలో చేరి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెకు ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు నియామక పత్రం అందజేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి.. బుధవారం టీడీపీలో చేరారు. 24 మంది కౌన్సిలర్లకు గాను 22 మంది హాజరయ్యారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులిద్దరితో కలిపి 13 మంది గౌతమికి ఓటు వేయడంతో గెలుపొందారు.
News December 11, 2025
BREAKING: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గౌతమి

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తతలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News December 11, 2025
అనంతపురం కలెక్టర్‌కు 22వ ర్యాంకు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 22వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 930 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 863 ఫైల్స్ క్లియర్ చేశారు. ఈయన ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి సగటున 5 రోజుల 22 గంటల సమయం తీసుకున్నారు.


