News March 21, 2025

ATP: భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

image

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం(D)లో జరిగింది. పెద్దపప్పూరు మం. వరదాయపల్లికి చెందిన శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 17న మద్యం మత్తులో భార్య చెవిని కోసి కమ్మలు తీసుకెళ్లడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు నిందితుడిని అరెస్ట్ అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు SI నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.

Similar News

News September 17, 2025

BC రిజర్వేషన్లను పెంచేందుకు చర్యలు: మంత్రివర్గ ఉపసంఘం

image

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లోగా BC రిజర్వేషన్లను 34 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో BC రిజర్వేషన్లపై చర్చించామన్నారు. రిజర్వేషన్లను CBN 34%కి పెంచితే, జగన్ 24%కి తగ్గించారని పేర్కొన్నారు. న్యాయపరిశీలన చేసి రిజర్వేషన్లపై పకడ్బందీ చట్టం తెస్తామన్నారు. త్వరలో BC రక్షణ చట్టానికి తుది రూపం తీసుకురానున్నట్లు చెప్పారు.

News September 17, 2025

సంగారెడ్డి: న్యాయవాదుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

image

న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ జిల్లా కోరుతూ ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను బుధవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేయడం సరికాదని వారు తెలిపారు.

News September 17, 2025

కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల మోసం: మంత్రి పొంగులేటి

image

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మాజీ సీఎం కేసీఆర్ రూ. లక్ష కోట్లు మోసం చేశారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం నేలకొండపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం అని, అభివృద్ధి, సంక్షేమం 2 సమానంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఇళ్లు నిర్మిస్తే కమీషన్ రాదనే ఉద్దేశంతోనే కేసీఆర్ పేదల ఇళ్లను నిర్మించలేదన్నారు.