News August 31, 2024
ATP: రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 32.0 నుంచి 35.0 డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 23.8 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా రెండ్రోజులుగా జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తోంది.
Similar News
News March 14, 2025
డ్రోన్లతో ప్రత్యేక నిఘా: ఎస్పీ

మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, ఇబ్బందులు కలిగించడం వంటివి చేయరాదన్నారు. కీలక ప్రదేశాలు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కుట్రలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
News March 13, 2025
అందరూ సమష్టిగా పని చేయాలి: RJD

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక SSBN డిగ్రీ కళాశాలలోని వర్చువల్ రూమ్లో CS, DOలకు వర్చువల్ ప్రోగ్రామ్ జరిగింది. పదో పరీక్షలు ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్నాయని RJD శ్యామ్యూల్ తెలిపారు. చీప్ సూపర్వైజర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ సమష్టిగా పని చేయాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి స్మార్ట్ వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లరాదని సూచించారు.
News March 13, 2025
రామాయణం రాసిన తొలి కవియిత్రి అతుకూరి మోలమాంబ: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కవియిత్రి అతుకూరి మోలమాంబ జయంతి అనంతపురం జిల్లాలో ఘనంగా జరిగింది. అనంతపురం నగరంలోని రెవెన్యూ భవన్లో కవియిత్రి అతుకూరి మోలమాంబ చిత్రపటానికి కలెక్టర్ వినోద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామాయణం రాసిన తొలి కవియిత్రి అతుకూరి మోలమాంబ అని జిల్లా కలెక్టర్ తెలిపారు. నాట్య పోటీల్లో గెలిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతి ప్రదానం చేశారు.