News August 31, 2024

ATP: రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని రేకుల కుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులూ పగటి ఉష్ణోగ్రతలు 32.0 నుంచి 35.0 డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 23.8 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా రెండ్రోజులుగా జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తోంది.

Similar News

News July 6, 2025

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

image

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

News July 5, 2025

గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

image

నార్పల మండలం గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం డీఎస్పీ వెంకటేశ్ శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, అగ్నిగుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు, అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కేటాయించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామని చెప్పారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.

News May 8, 2025

ATP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సూచించారు. AP విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. AP విపత్తుల సంస్థ SMSలు, RTGS నుంచి సూచనలను తెలుపుతున్నామన్నారు. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.