News March 11, 2025
ATP: వంకర పాదాలతో పుట్టిన పిల్లలకు చికిత్స

అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టుకతో వంకర పాదాలతో పుట్టిన పిల్లలకు మంగళవారం వైద్యులు చికిత్సను అందించారు. ఈ సందర్భంగా డీఈఐసీ మేనేజర్ రజిత మాట్లాడుతూ.. త్వరిత చికిత్స కేంద్రంలో వంకర పాదాలతో పుట్టిన 10 రోజులలోపు పిల్లలకు కాస్టింగ్ చేయడమే కాకుండా, అవసరమయిన వారికి ఉచితంగా స్ప్లింట్లను అందించామన్నారు. అలాగే పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి చికిత్సను అందిస్తామన్నారు.
Similar News
News October 15, 2025
పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మన దేశ వారసత్వం, పురాతన కట్టడాల గురించి తెలపాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు.
News October 15, 2025
ఈనెల 17 నుంచి జిల్లాస్థాయి సైన్స్ సెమినార్

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈనెల 17 నుంచి జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు డీఈవో ప్రసాద్ బాబు, సైన్స్ సెంటర్ క్యూరేటర్ బాల మురళీకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం మండల స్థాయిలో సెమినార్ నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామన్నారు.
News October 15, 2025
అనంతలో కేరళ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన

కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం జాతీయ అధ్యక్షుడు పీకే, ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే అనంతపురం నగరానికి విచ్చేశారు. అనంతపురంలో ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ప్రజా సమస్యలపై సింధూర అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలన్నారు.