News March 22, 2025
ATP: శక్తి మొబైల్ యాప్ మహిళలకు రక్ష: ఎస్పీ

ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న శక్తి మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకొని రిజిస్ట్రేషను చేసుకోవాలని జిల్లా ఎస్పీ జగదీష్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఆపద సమయాలలో మహిళలకు ఈ యాప్ కుటుంబ సభ్యుల్లా ఎంతో సహాయపడుతుందన్నారు. ఆపద వేళల్లో యాప్‌లోని SOS బటన్‌ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం తామున్న ప్లేస్‌కి చేరుకొని రక్షిస్తుందన్నారు.
Similar News
News April 24, 2025
ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.
News April 23, 2025
కూలీ కుమారుడికి 593 మార్కులు

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
News April 23, 2025
10th Results: అనంతపురం జిల్లాకు ఈసారి నిరాశే.!

అనంతపురం జిల్లా పదో తరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించలేదు. 30,700 మంది విద్యార్థులలో 21,510 మంది ఉత్తీర్ణత సాధించారు. 70.07 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో 30,893 మందికి 25,003 మంది పాసయ్యారు. 84.46 శాతంతో పాస్ పర్సంటేజ్‌తో 24వ స్థానంలో నిలిచింది. ఈసారి 23తో ఒక స్థానం మెరుగైంది.