News October 27, 2024
ATP: శింగనమల వద్ద ఘోర ప్రమాదం.. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్!
శింగనమల క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు హరేరామ.. హరే కృష్ణ భక్తులు <<14460473>>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు టైరు పేలి లారీని ఢీకొందా? అతివేగం కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారంతా 30 ఏళ్లలోపు వారే. వీరిలో నలుగురు అనంత, సత్యసాయి జిల్లా వాసులు.
Similar News
News November 13, 2024
అసెంబ్లీ విప్‌గా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా సేవలందించారు. విప్‌గా ఎంపికైనందుకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
News November 12, 2024
అనంతపురం: వీళ్లు పట్టు.. ఉడుం పట్టు
అనంతపురం జిల్లా క్రీడాకారులు కుస్తీ పోటీల్లో పట్టు పట్టారంటే మెడల్ రావాల్సిందే అన్నట్లు దూసుకెళ్తున్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న స్కూల్ గేమ్స్‌ల్లో అండర్ -17 బాలుర విభాగంలో రోహిత్, బాలికల విభాగంలో రాణి గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయిలో పోటీ పడి గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో వారు ఢిల్లీలో డిసెంబర్ 23న జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కుస్తీ కోచ్ రాఘవేంద్ర తెలిపారు.
News November 12, 2024
అపార్ సకాలంలో జరగకపోతే కఠిన చర్యలు: కలెక్టర్ వినోద్
జిల్లాలో అపార్ జనరేషన్ సకాలంలో పూర్తిగా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో పాఠశాల విద్యా శాఖపై విద్యా, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలలోనే నిర్వహించాలని ఆదేశించారు.