News September 14, 2024
ATP: సీఎం ఎస్కార్ట్ వాహన కానిస్టేబుల్ హఠాన్మరణం
సీఎం చంద్రబాబు ఎస్కార్ట్ వాహన డ్యూటీ నిమిత్తం విజయవాడకు వెళ్లిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ గుండెపోటుతో మృతి చెందారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మం. గరుగుతండాకు చెందిన చంద్రనాయక్ అనంతపురం జిల్లా సాయుధ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి వెళ్లేందుకు ఎస్కార్ట్ వాహనం సిద్ధం చేశారు. ఈ క్రమంలో చంద్రనాయక్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు.
Similar News
News October 13, 2024
గ్యాంగ్ రేప్ బాధాకరం: పయ్యావుల
బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చి చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో అత్తా కోడలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని చెప్పారు.
News October 13, 2024
మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ జేఎన్టీయూకు మార్పు
అనంతపురం జిల్లా మద్యం షాపులకు ఎంపిక ప్రక్రియ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ నుంచి జేఎన్టీయూకు మార్చామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు లాటరీ ద్వారా మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నమని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు.
News October 12, 2024
భారీ వర్షాల నేపథ్యంలో రేపు కలెక్టరేట్‌లో సమీక్ష
ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు స్పందన గ్రీవెన్స్ హాలులో ముఖ్య శాఖల అధికారులతో సమీక్ష ఉంటుందని, సంబంధిత అధికారులు తప్పకుండా హాజరు కావాలని ఓ ప్రకటనలో తెలిపారు.