News April 13, 2025
ATP: ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తి కాపాడిన పోలీసులు

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని అనంతపురం జిల్లా యాడికి పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. స్థానికుల వివరాల మేరకు.. యాడికికి చెందిన గంజి శేఖర్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్య సౌమ్యకు వీడియో పంపాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వీరన్న టెక్నాలజీని ఉపయోగించి ఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్య చేసుకోబోయిన గంజి శేఖర్‌ను కాపాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Similar News
News April 14, 2025
అనంతపురంలో పోలీసుల అవగాహన సదస్సు

జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అనంతపురంలోని మూడవ పట్టణ పోలీసులు రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్‌తో వాహనాలు వెళ్ళకూడదన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేయరాదన్నారు.
News April 13, 2025
తాడిపత్రిలో వ్యభిచార కేంద్రంపై దాడి.!

తాడిపత్రిలో వ్యభిచార స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాలతో రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి పక్కా సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిలో ఒకరిది వైజాగ్, మరోకరు ఆర్గనైజర్‌తోపాటు నలుగురు మగ వ్యక్తులను, 4 నిరోధ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేస్తున్నట్లు CI శివగంగాధర్ తెలిపారు.
News April 13, 2025
అనంత: ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలికి తృటిలో తప్పిన ప్రమాదం

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుకియ బేగం ఆదివారం నెల్లూరుకు వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఆమె భర్త రియాజ్ పేర్కొన్నారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె కాలికి తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. తిరుపతి శివారులలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆమె చికిత్స పొందుతుందన్నారు.