News August 25, 2025
ATP: ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

వజ్రకరూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పామిడికి చెందిన బాబా ఫక్రుద్దీన్, ఫరూక్, నజీర్ ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు. ఉరవకొండ నుంచి పామిడికి వెళ్తుండగా ఓ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఉరవకొండకు తరలించగా నజీర్ (20) మార్గ మధ్యలో మృతి చెందాడు. మరొకరు అనంతపురంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Similar News
News August 25, 2025
జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జిల్లాలో 2600 మెట్రిక్ టన్నుల యూరియా, 5600 లీటర్ల నానోయూరియా నిల్వ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని అన్ని PACS, ప్రైవేట్ డీలర్లకు యూరియాను సరఫరా చేసినట్లు తెలిపారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానోయూరియాను వాడుకోవచ్చని సూచించారు. ఎకరానికి కొంత మోతాదులో యూరియాను వాడితే సరిపోతుందన్నారు.
News August 25, 2025
జగిత్యాలలో వైభవంగా గణేశ్ ఆగమనాలు..!

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఆగమనాలు భారీగా సాగుతున్నాయి. పండక్కి 2 రోజుల సమయమే ఉండటంతో నిర్వాహకులు ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా కారణాలతో ప్రతిమలను ముందే మండపాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా భారీ సైజ్ గణనాథులు వారంరోజుల ముందుగానే మండపాలకు చేరుకున్నాయి. ఇంకొన్ని చేరుకుంటున్నాయి. కాగా, ఈసారి చవితి ఉత్సవాల కోసం పోలీసు శాఖ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఉత్సవాలు శాంతియుతంగా సాగేలా ప్రజలు కూడా సహకరించాలి.
News August 25, 2025
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!

పండగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి GST కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. GSTని సరళీకరిస్తూ అన్ని వస్తువులపై ట్యాక్స్‌ను రెండు శ్లాబ్స్(5%, 18%)కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. మీటింగ్‌లో చర్చించి వీటిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే లగ్జరీ వస్తువులకు మాత్రం 40% GST ఉండనుంది.