News December 25, 2025

ATP: మహిళను నమ్మించి మోసం చేశారు!

image

ఉరవకొండ మం. నింబగల్లులో బంగారు నగలకు మెరుగు పెడతామని నమ్మించి స్వరూప అనే మహిళ వద్ద 2 తులాల గొలుసును దుండగులు అపహరించారు. ఇద్దరు వ్యక్తులు ఇత్తడి సామాన్లతో పాటు గొలుసును శుభ్రం చేస్తామని నమ్మించారు. గిన్నెలో ఆమె గొలుసు వేసి చాకచక్యంగా చోరీ చేశారు. అనుమానం రాకుండా నీటిపై పలు రంగులు వేసి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టమని అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత గిన్నెను పరిశీలించిన గొలుసు లేకపోవడంతో కంగుతింది.

Similar News

News December 29, 2025

పోలవరం జిల్లాలో జనాభా ఎంతంటే?

image

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పడిన విషయం తెలిసిందే. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త జిల్లాలు అమలులోకి రానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పోలవరం జిల్లాలో జనాభా 3,49,000, 12 మండలాలు, 178 గ్రామ పంచాయతీలు, 140 గ్రామ సచివాలయాలు, 832 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. పోలవరం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 6431.63 చదరపు కిలోమీటర్లగా ఉంది.

News December 29, 2025

రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ యథాతధం- మంత్రి సుభాష్

image

రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని మంత్రి సుభాష్ వెల్లడించారు. రామచంద్రపురం, కె.గంగవరం మండలాలు, మున్సిపాలిటీతో కలిపి డివిజన్ కొనసాగుతుందన్నారు. ఈ నిర్ణయంతో ప్రతిపక్షాల దుష్ప్రచారానికి తెరపడిందని వ్యాఖ్యానించారు. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

News December 29, 2025

ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కొరత లేదు

image

రాష్ట్రంలో ప్రతి రైతుకు పంట అవసరాలకు సరిపడినంత యూరియాను తప్పనిసరిగా అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్లు, అధికారులతో యూరియా పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ADB కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న యూరియాను పకడ్బందీగా పంపిణీ చేయాలని సూచించారు.