News October 23, 2024
ATP: వరద గాయం రూ.5కోట్ల పైనే!

★ అనంతపురం నగరంలో నిరాశ్రయులైన 200 కుటుంబాలు
★ పదుల సంఖ్యలో నీట మునిగిన ఆటోలు, బైక్లు
★ ఇళ్లల్లోని సరకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు జలమయం
★ 370 హెక్టార్లల్లో దెబ్బతిన్న పంటలు
★ 55 హెక్టార్లల్లో ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం
★ అనంత, సత్యసాయి జిల్లాల్లో 100కుపైగా మృతిచెందిన జీవాలు
★ వర్ష బీభత్సానికి నేలకూలిన ఇళ్లు.. దెబ్బతిన్న రహదారులు
★ రెండు జిల్లాల్లో రూ.5కోట్లకుపైగా నష్టం జరిగినట్లు అంచనా!
Similar News
News November 10, 2025
దళిత ఉద్యమ కెరటం కత్తి పద్మారావు

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 గుంటూరు(D) పొన్నూరుకు చెందిన పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతలో జరిగిన సభకు పద్మారావు హాజరు కాలేకపోయారు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.
News November 10, 2025
జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.
News November 9, 2025
అనంతలో ముగిసిన రెవిన్యూ క్రీడలు

అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత, అనంతపురం MP అంబికా లక్ష్మీ నారాయణ, పలువురు MLAలు హాజరయ్యారు. అసోసియేషన్ నాయకులను అభినందించి, గెలుపొందిన వారికి మెమెంటోలు అందించారు.


