News March 11, 2025
ATP: విద్యాశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు కల్పించేలా విద్యాశాఖ, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. GO నంబర్ 117 తో గతంలో 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో కలపడం జరిగిందని, బేసిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. 3 కి.మీ లోపల హైస్కూల్ లేని చోట తగు ఏర్పాట్లు చేసి, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.
Similar News
News December 16, 2025
PGRSకు అన్ని శాఖల అధికారులు పాల్గొనాలి: కలెక్టర్

మండల స్థాయిలో నిర్వహించే PGRS కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. ప్రతి మండలం, డివిజన్ కార్యాలయాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి హాజరయ్యేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పీజిఆర్ఎస్ కార్యక్రమానికి అధికారులందరూ ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు.
News December 15, 2025
ATP: మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం

రాయదుర్గం మండలం పల్లేపల్లిలో తిప్పన్న (72), తిప్పమ్మ (68) దంపతులు ఒకేరోజు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఇటీవల తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఆ దిగులుతో తిప్పన్న సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఉదయమే ఆమె కూడా కన్ను మూసింది. ఒకే రోజు భార్యాభర్త మృతి చెందడంతో ‘మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం’ అని గ్రామస్థులు పేర్కొన్నారు.
News December 15, 2025
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: SP

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు వచ్చే ప్రతి పిటిషన్‌ను విచారించి తక్షణమే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ జగదీష్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 96 అర్జీలు స్వీకరించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


