News October 27, 2024

ATP: శింగనమల వద్ద ఘోర ప్రమాదం.. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్!

image

శింగనమల క్రాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు హరేరామ.. హరే కృష్ణ భక్తులు <<14460473>>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు టైరు పేలి లారీని ఢీకొందా? అతివేగం కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారంతా 30 ఏళ్లలోపు వారే. వీరిలో నలుగురు అనంత, సత్యసాయి జిల్లా వాసులు.

Similar News

News February 23, 2026

సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఆనంద్

image

అనంతపురం జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. నగరంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫర్ గర్ల్స్ కాలేజ్‌లో మొదటి సంవత్సరం పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాల్ ప్రాక్టీస్ లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, మెడికల్ క్యాంపు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ వెల్లడించారు.

News February 23, 2026

అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.