News November 16, 2024
ATP: 16వ తేదీలోపు చంపేస్తామని వార్నింగ్

చెప్పిన టైంలోపు లేపేస్తామని మెసేజ్లు రావడం అనంతపురంలో కలకలం రేపింది. బాధితుడి వివరాల మేరకు.. నగరంలోని కురుబ గేరికి చెందిన నాగార్జున బంగారు నగలు తయారు చేస్తుంటాడు. రెండు వారాలుగా ఆయనకు ఓ నంబర్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ‘డిసెంబర్ 16వ తేదీ లోపు నిన్ను చంపేస్తాం’ అని అందులో ఉంది. ఆ నంబర్కు కాల్ చేస్తే లిప్ట్ చేయడం లేదు. కంగారుతో నాగార్జున అనంతపురం ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 2, 2025
ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ MPDOకు జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. PGRS గ్రీవెన్స్లో నిర్ణీత గడువులోగా అర్జీలను చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. చిన్న పోలమాడ పంచాయతీ కార్యదర్శి బలరామమూర్తి, హవళిగి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉరవకొండ డిప్యూటీ MPDO సతీశ్ కుమార్కు నోటీసులు ఇచ్చామన్నారు.
News December 1, 2025
ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి కేశవ్

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదిగవి గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. గంటపాటు విద్యార్థులకు పాఠం చెప్పారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల తెలివితేటలను చూసిన మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలలో అధిరోహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
News December 1, 2025
నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి

ఉరవకొండ మండలం బూదిగవిలో రూ.43.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.


