News August 4, 2025
ATP: SP ఆఫీసు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పోలీసుల దురుసు ప్రవర్తనతో మనస్తాపానికి గురై బుక్కరాయసముద్రం (M) రెడ్డిపల్లికి చెందిన బాలకృష్ణ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం అనంతపురం SP కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. బాధితుడు మాట్లాడుతూ.. రూ.15 లక్షలు అప్పు తీర్చలేక పోలీసు ఉన్నతాధికారులకు సమస్య వివరించానన్నాడు. ఈ క్రమంలో పోలీసులు దూషించారన్నాడు. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని వాపోయాడు.
Similar News
News September 4, 2025
జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మంది ఎంపిక

అనంతపురం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా వీరికి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అవార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
News September 4, 2025
మిలాద్-ఉన్-నబీ పర్వదినాన పటిష్ఠ చర్యలు: ఎస్పీ

ఈనెల 5న జరిగే మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఎస్పీ పి.జగదీశ్ ఆదేశించారు. శాంతి కమిటీల సమావేశాలు నిర్వహించి, మతసామరస్యంతో పండుగ ర్యాలీ కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిలాద్-ఉన్-నబీ పర్వదినాన ముస్లింలు నిర్వహించే ర్యాలీలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.
News September 3, 2025
అనంతపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..!

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అనంతపురం జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. పామిడిలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న యాదవ్ అరుణ, ఆత్మకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉప్పరపల్లి శైలజ, గుత్తి మండలం అబ్బేదొడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బండి శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈనెల 5న సీఎం చేతుల మీదుగా విజయవాడలో అవార్డులు అందుకోనున్నారు.