News October 2, 2024

దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం!

image

TG: వరంగల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముగ్గురు యువకులు గత నెల 15న తనను ఓయో రూమ్‌కు తీసుకెళ్లి, బీరు తాగించి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు తాను చదివే కాలేజీలోనే బీటెక్ చదువుతున్నారని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 12, 2025

MANAGEలో భారీ జీతంతో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(<>MANAGE<<>>)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, MBA/PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మేనేజర్‌కు నెలకు రూ.1.50లక్షలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.manage.gov.in/

News November 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 64

image

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని గురువైన పరశురాముడు ఎలా గుర్తించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 12, 2025

టుడే..

image

* AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్న వైసీపీ
* కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
* TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ, రేపు <<18194401>>స్పీకర్<<>> విచారణ
* మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్లూరి
* వేములవాడ ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత