News July 12, 2024
దారుణం.. దళిత యువకుడితో మూత్రం తాగించారు

UPలోని శ్రావస్తి జిల్లాలో దారుణం జరిగింది. తమ ఫంక్షన్‌కు ఎక్కువ డబ్బు తీసుకున్నాడనే సాకుతో DJ ఆపరేటర్(15ఏళ్ల బాలుడు)తో కొందరు యువకులు మూత్రం తాగించారు. లిక్కర్ బాటిల్‌లో మూత్రం పోసి బలవంతంగా బాధితుడితో తాగించి వీడియో తీశారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులైన కిషన్ తివారీ, దిలీప్ మిశ్రా, సత్యం తివారీ మద్యం మత్తులో ఈ దారుణం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News April 4, 2026
IPL చూసేవారికి JIO షాక్

మెగా టోర్నీ వేళ రిలయన్స్ జియో రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. గతంలో 90 రోజుల పాటు అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని ఇప్పుడు కేవలం 30 రోజులకు తగ్గించింది. అయితే ఇందులో వచ్చే 15GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను యథావిధిగా అందిస్తుంది. వ్యాలిడిటీ తగ్గడం వల్ల తక్కువ ధరకే ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది భారంగా మారింది.
News April 4, 2026
బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,50,930 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1,38,350గా ఉంది. అటు KG సిల్వర్ రేటు ₹2,55,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో ధరలు నిలకడగా ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు.