News November 19, 2024
విశాఖలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

AP: విశాఖలో న్యాయ విద్య అభ్యసిస్తోన్న యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లతో చిత్రీకరించి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా తండ్రి కాపాడారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులు వంశీ, ఆనంద్, రాజేశ్, జగదీశ్‌ను అరెస్టు చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని హోంమంత్రి అనిత ఆదేశించారు.
Similar News
News January 22, 2026
చరిత్ర సృష్టించిన ‘సిన్నర్స్’

ర్యాన్ క్లూగర్ డైరెక్షన్లో మైఖేల్ బి.జోర్డాన్ నటించిన ‘సిన్నర్స్’ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా ఆస్కార్ నామినేషన్స్‌లో 16 కేటగిరీల్లో చోటు దక్కించుకుంది. గతంలో All About Eve(1950), Titanic(1997), La La Land(2016) 14 కేటగిరీల చొప్పున నామినేషన్స్‌లో నిలిచాయి. ఇప్పుడు వాటి రికార్డును సిన్నర్స్ బద్దలుకొట్టింది. హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డునూ అందుకుంది.
News January 22, 2026
2025-DSC సెలెక్టడ్ SA టీచర్లకు పే ప్రొటక్షన్

AP: SGT లేదా ఇతర ప్రభుత్వ పోస్టులకు రాజీనామా చేసి 2025 DSCలో స్కూల్ అసిస్టెంట్లుగా చేరిన టీచర్లకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పాత పోస్టులో చేరిన తేదీ నుంచి సర్వీసు కొనసాగుతుందని, వారికి పే ప్రొటెక్షన్ కల్పించాలని DEOలకు ఆదేశాలిచ్చింది. పే ప్రొటక్షన్ కోసం వారి అభ్యర్థనలపై నిబంధనలను అనుసరించి వేతన రక్షణ సహా ఇతర చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో రాజీనామా చేసిన పోస్ట్ ఆధారంగా శాలరీ ఉండనుంది.
News January 22, 2026
టీచర్లు చదువుకుంటామంటే అనుమతించడం లేదు: APTF

AP: 5 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన టీచర్ల ఉన్నత చదువులకు GOలో లేని నిబంధనలు పెడుతూ అనుమతించడం లేదని APTF విమర్శించింది. ‘140 మంది టీచర్లు దరఖాస్తు చేస్తే 100 మందిని డైరక్టరేట్ తిరస్కరించింది. ఇప్పటికే కొందరు కాలేజీల్లో ఫీజులూ కట్టారు. అయినా అధికారులు పెండింగ్‌లోఉంచారు’ అని సంఘం నేతలు హృదయరాజు, చిరంజీవి పేర్కొన్నారు. GO 342 ప్రకారం చదువుకోడానికి అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్‌ను కోరారు.


