News October 17, 2024
దారుణం.. రసాయనాలతో మిల్క్ తయారీ

TG: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పాల పొడి, ఎసిడిక్ యాసిడ్, గ్లూకోజ్, వనస్పతి, ఇతర రసాయనాలతో నకిలీ పాలను తయారుచేస్తున్నారు. HYD శివారు పీర్జాదిగూడలో ఈ ఉదంతం బయటపడింది. కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్ల పేరిట కల్తీ పాలు, పెరుగు, ఐస్క్రీంలను స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా లోగోలు వేసి విక్రయిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


