News August 21, 2024
దారుణం: బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన టీచర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724202035793-normal-WIFI.webp)
విద్యార్థులకు సన్మార్గం చూపాల్సిన గురువే కామాంధుడిలా మారారు. బాలికలకు అశ్లీల వీడియోలను చూపించి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని కజిఖేడ్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు ప్రమోద్ సర్దార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 12, 2025
అమ్మాయిలూ.. క్యాబ్ బుక్ చేస్తున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344809482_746-normal-WIFI.webp)
ఉబర్‌లో క్యాబ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ వాట్సాప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించి ఇబ్బందికి గురిచేశాడు. కేరళలోని కట్రికడావులో ఓ మహిళ ‘ఉబర్’లో క్యాబ్ బుక్ చేసింది. అయితే, రెండు రోజుల తర్వాత ఆమె వాట్సాప్‌కు అపరిచిత వ్యక్తి నుంచి ‘మీరు వాడే స్ప్రే ఏ కంపెనీ’ అని మెసేజ్‌లు రావడంతో ఆమె అతణ్ని బ్లాక్ చేసింది. ట్విటర్లో ఈ విషయాన్ని ‘ఉబర్’కు తెలియజేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరలవుతోంది.
News February 12, 2025
వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720797697-normal-WIFI.webp)
TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
News February 12, 2025
సంజూ శాంసన్‌కు సర్జరీ పూర్తి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363807386_1045-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో ముగిసిన టీ20 సిరీస్ ఆఖరి మ్యాచ్ సందర్భంగా ఆర్చర్ బౌలింగ్‌లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. ఆ వేలికి తాజాగా సర్జరీ పూర్తైందని క్రిక్ఇన్ఫో వెల్లడించింది. సర్జరీ నుంచి కోలుకునేందుకు ఆయనకు నెల రోజులు సమయం పట్టొచ్చని తెలిపింది. ఐపీఎల్ సమయానికి సంజూ ఫిట్‌గా ఉంటారని సమాచారం. కాగా.. ఈ సర్జరీ కారణంగా ఆయన కేరళ రంజీ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్‌కు దూరమయ్యారు.